ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. గతంలో.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. తన ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. అయితే.. ఆ రాజీనామాను ఆమోదించినట్లు.. నిన్న టి నుంచి ప్ర చారం జరిగింది. అయితే.. దీనిపై స్వయంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు.
నా రాజీనామా ఆమోదమంటూ రాత్రి నుంచి దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రెండేళ్ల క్రితం రాజీనామా చేసి స్పీకర్ నూ వ్యక్తిగతంగా రెండుసార్లు కలిశానని వెల్లడించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. అప్పటినుంచి ఆమోదించని రాజీనామా గంటలో ఓటింగ్ అనగా ఆమోదిస్తారా? మా అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలవబోతున్నారన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.