మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి కాబోతున్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. 2019 ఎన్నికల్లో పాలిచ్చే అవుని కాదని, తన్నే దున్నను తెచ్చుకున్నామని జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ప్రభుత్వం రోజులు లెక్కపెట్టుకోవాలి… నాలుగేళ్ల పాలనలో ఒక్క ఇటుక కూడా వేయలేదని నిలదీశారు. కానీ ఎన్నికల ఏడాదిలో పోర్టు, ఎయిర్ పోర్ట్ కడతానని నమ్మిస్తున్నాడు….అవినీతి, అక్రమాలు, అన్యాయాల్లోనే వైసిపి ప్రభుత్వం మొదటి స్ధానంలో నిలబడిందన్నారు. అస్ధవ్యస్ధ పాలను గాడి లో పెట్డడానికి మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి కాబోతున్నారని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు.