ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 476 మంది నైట్ వాచ్‌మన్‌ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జగన్ సర్కార్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ కాలేజీల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాత్రిపూట కాలేజీల వద్ద కాపలా కాసేందుకు నైట్ వాచ్ మెన్ పోస్టుల భర్తీకి అనుమతించింది.
476 కాలేజీల్లో ఈ నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. వీరికి నెలకు రూ. 6000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని, ఇందుకోసం ఇంటర్ విద్య మండలి నిధుల నుంచి వాడుకోవాలని సూచించింది. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో 5,388 మంది నైట్ వాచ్ మెన్ లను నియమించారు.