మాది పువ్వు పార్టీనా…మీదే డబ్బా ఫ్యాన్ పార్టీ.. చెత్త ఫ్యాన్ పార్టీ – జీవీఎల్

-

మాజీ మంత్రి పేర్ని నానిపై జీవీఎల్ ఫైర్ అయ్యారు. మాది పువ్వు పార్టీనా.? అడ్డంగా బలిశారంటూ మా నడ్డాను వ్యక్తిగతంగా విమర్శిస్తారా..? మాజీ మంత్రులివి ఒళ్లు బలిసిన మాటలు అని నిప్పులు చెరిగారు జీవీఎల్‌. మీదే డబ్బా ఫ్యాన్ పార్టీ.. చెత్త ఫ్యాన్ పార్టీ అని.. డబ్బా ఫ్యాన్ తమ నెత్తి మీద ఎప్పుడు పడుతుందా..? అనే భయంలో ప్రజలు ఉన్నారన్నారు.

ఇష్టానుసారంగా మాట్లాడితే ఖబడ్దార్… వైసీపీ నేతలు మాట్లాడే ప్రతి చెత్త కామెంటును మా పార్టీ హైకమాండుకు తర్జుమా చేసి పంపుతామని హెచ్చరించారు. కేంద్ర నిధులను మళ్లిస్తోంది నిజం కాదా..? కాగ్ తప్పు పట్టిన విధంగా రూ. 12 వేల కోట్లు ఏమయ్యాయి..? అరాచక పాలన సాగిస్తున్న వైసీపీకి ఎక్కడ తగలాలో అక్కడ తగిలిందన్నారు.

మీకు మీరు డబ్బా కొట్టుకోవడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు.. కేంద్రం ఆయుష్మాన్ భారత్ పధకాన్ని‌ ఆరోగ్య శ్రీగా మార్చ లేదా..? కేంద్ర పధకాలకు మీ స్టిక్కర్లు వేసుకుంది వాస్తవం కాదా..? కాగ్ నివేదిక చూపిస్తే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు..? అని ప్రశ్నించారు. వీటి సమాధానం చెప్పే దమ్ము మీకుందా ? కేంద్రం ఎంత సాయం చేసింది‌.. మీరు దేనికి ఎంత వాడారు..? ఆర్ధిక మంత్రి బయటకు వచ్చి చర్చిస్తారా..? ఆర్ధిక మంత్రి ఢిల్లీలో పర్యటిస్తోంది అప్పుల కోసం కాదా..? కొత్తగా తీసుకున్న అప్పుల నుంచి పాత అప్పులు చెల్లిస్తోంది నిజం కాదా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news