రేప్ కేసుపై రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోయల్ డెవిస్ తో నాకు పంచాయతీ ఏమి లేదని.. జోయల్ డెవిస్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి… ఎమ్మేల్యే కొడుకు లేడని ఎవరు ఒత్తిడితో జోయల్ డెవిస్ ప్రకటించారన్నారు. CP చాలా అంశాల పై క్లారిటీ ఇవ్వలేదని.. ఇన్నోవా, బెంజ్ ల యజమానులు ఎవరు అని ప్రశ్నించారు. ఇన్నోవా ప్రభుత్వ వాహనం అయితే డ్రైవర్ ఎందుకు లేడు.. కొన్ని విషయాలు దాచి బెడుతున్నారని అనుమానం ఉంది..హోమ్ మినిస్టర్ మనవడు కి సంబందించిన ఆధారాలు ఇవ్వాలని పోలీస్ లు అడిగితే ఇచ్చేందుకు నేను సిద్దమని పేర్కొన్నారు.
నిందితులకు ఇన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది అనడానికి సీపీ ఎవరు ? అని నిలదీశారు. నేను బయట పెట్టిన పోటో ల్లో ఉన్న వారు మైనర్ ల, మేజర్ లా నాకెలా తెలుస్తుంది.. విచారణలో తెలుస్తుంది.. అందరూ మేజర్ ల లెక్కనే ఉన్నారన్నారు. నిందితులే వీడియో లు బయట పెట్టుకున్నారని సీపీ చెప్పారు ఇంకా నా మీద కేసు ఎక్కడిదన్నారు. వీడియోలు బయట పెట్టింది ఎవరు… ఆ మొబైల్ ను ఎందుకు సీజ్ చేయలేదు.. నోటీస్ లు ఇస్తే సమాధానం చెబుతానన్నారు. Trs, కాంగ్రెస్ ,mim లు కలిసి ముందుకు వెళ్లేందుకు ఈ కేసు ను గ్రౌండ్ గా వాడుకుంటున్నారని.. కేటీఆర్… హిందువులకు ఒక న్యాయం, ముస్లిం లకు ఒక న్యాయమా అని ఆగ్రహించారు.