ట్విట్టర్లో వాఖ్యలు చేసిన వర్మ ట్విట్ తొలగించి.. తన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు జివిఎల్ నర్సింహా రావు. ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేశారని.. ఇది చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమని.. తొలిసారిగా ఆదివాసి మహిళకు ఈ అవకాశం దక్కడం గొప్ప విషయమని వెల్లడించారు.
దేశమంతా పండుగ వాతావరణమని.. ఇతర పార్టీలకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు సైతం ద్రౌపది ముర్ము కు మద్దతు పలికే పరిస్థితి నెలకొందని చెప్పారు. ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తో మాట్లాడి మద్దతు అడిగారని.. జూలై ఒకటో తేదీ నుంచి ద్రౌపది ముర్ము ప్రచారం మొదలు పెడతారని చెప్పారు.
ఇతర పార్టీలు సైతం పుంరాలోచనలో పడ్డారని.. ఉన్నతమయిన ఆలోచనతో ఈ నిర్ణయం బిజెపి తీసుకుందని చెప్పారు. కొందరు తప్పుడు వాఖ్యలు చేస్తున్నారు… రాష్ట్రపతి కానున్న మహిళపై కామెంట్స్ చేయటం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు జీవీఎల్.