కానిపాకంలో వివాదానికి కారణం అతనే – మంత్రి కొట్టు సత్యనారాయణ

కాణిపాకం లో వివాదానికి ఇన్చార్జి ఈవోనే కారణమని అన్నారు దేవాదయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. అభిషేకం టికెట్ ధర పెంపుపై అభిప్రాయ సేకరణకు నోటీసు విడుదల చేశారని..  అతను ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్లనే ఈ గందరగోళం ఏర్పడిందని అన్నారు. అతడిని విధులనుంచి తప్పించినట్లు తెలిపారు మంత్రి. ఇన్చార్జి ఈఓ పై విచారణకు ఆదేశించామన్నారు.

ఇదిలా ఉంటే దసరా నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారని.. సీఎం సూచనల మేరకే అద్భుతమైన ఏర్పాట్లు చేశామన్నారు. అందుకే విజయవాడలో దసరా నవరాత్రి ఉత్సవాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఉత్సవాలను ఘనంగా జరిపించారని అన్నారు. ఈ ఏడాది తీసుకున్న నిర్ణయాలు.. రాబోయే సంవత్సరాలకు మార్గదర్శకాలు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి అమ్మవారి ఆశీర్వాదం పై ఆధారపడి ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు, సీఎంకు అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని ప్రార్థించానన్నారు.