తెలంగాణ, ఏపీలకు మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు..!

-

Heavy rains for Telangana and AP for another 3 days: నిన్న సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడ్డాయి. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, హుజురాబాద్, మహబూబాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, మంచిర్యాల, హుస్నాబాద్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

Heavy rains for Telangana and AP for another 3 days

హైదరాబాద్ లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొందరి ఇళ్లలోకి నీళ్లు చొరబడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మణికొండ, గచ్చిబౌలి షేక్ పెట్ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్, ఉప్పల్, కొండాపూర్, లింగంపల్లి, కూకట్పల్లి ప్రాంతాల్లో తీవ్రంగా వర్షం పడటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఆ కారణంగా ట్రాఫిక్ కు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ఇక తాజాగా సమాచారం ప్రకారం.. ఏపీ, తెలంగాణకు మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version