ఏపీకి బిగ్ అలర్ట్..రేపటి నుంచి భారీ వర్షాలు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి ఏపీలో ముఖ్యంగా, నెల్లూరు, తిరుపతి లో భారీ వర్షాలు పడుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. ఆదివారం ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఇది విలీనం కాగా, ఈనెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.

అల్పపీడన ఈ ప్రభావంతో రేపటి నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. దీంతో అందరిలో మళ్లీ టెన్షన్ మొదలైంది. మరోవైపు రాబోయే రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయి అంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు పడుతున్నాయి. రెండు రోజుల నుంచి నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేని వర్షంతో జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news