ఇప్పటం కేసు పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం..ఒక్కొక్కరికి లక్ష జరిమానా

ఇప్పటం కేసు పిటిషనర్లకు ఏపీ హై కోర్టులో చుక్కదురైంది. ఇప్పటంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై ఏపీ హై కోర్టుకు వెళ్లిన పిటీషనర్లకు షాక్‌ తగిలింది. ఈ కేసులో పిటీషనర్లకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది ఏపీ హై కోర్టు.

కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన 14 మందికి ఏపీ హై కోర్టు జరిమానా విధించింది. అధికారులు నోటీసులు ఇచ్చినా… ఇవ్వలేదని కోర్టుకు అబద్దం చెప్పి.. స్టే తెచ్చుకున్నారని.. పిటీషనర్లకు జరిమానా విధించింది.