PSLV-C55 : పీఎస్‌ఎల్వీ-సీ55 రాకెట్ ప్రయోగం విజయవంతం

-

PSLV-C55 : పీఎస్‌ఎల్వీ-సీ55 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. సింగపూర్ కు చెందిన టెలియోస్.2..లూమీ లైట్ -4. ఉపగ్రహాలను కక్ష్య లోకి ప్రవేశపెట్టారు. అయితే.. పీఎస్‌ఎల్వీ-సీ55 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో మిషన్ కంట్రోల్ సెంటర్లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డా.సోమ్ నాథ్ మాట్లాడారు.

PSLV C-55 రాకెట్ నిర్దేశిత కక్ష్య లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిందని.. ఇందులో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు. ఇది కొంచెం క్లిష్టమైన ప్రయోగమని.. ఉపగ్రహాలతో పాటు ఏడు పే లోడ్స్ ను కూడా పంపామని వివరించారు. భవిష్యత్ లో కీలక ప్రయోగాలు చేపడతామని… మరిన్ని విదేశీ ఉపగ్రహాలను ప్రవేశపడతామని ప్రకటించారు.వాతావరణ పరిస్థితుల్లో రేయింబవళ్లు కవరేజీ అందించడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని చెప్పారు. పి.ఎస్.ఎల్.వి.ద్వారా వందలాది ఉపగ్రహాలను ప్రయోగించాం.. ఈసారి ప్రయోగించిన రాకెట్ లో కొన్ని మార్పులు చేశామని వివరించారు. దీని వల్ల వ్యయం తగ్గింది..విదేశాల నుంచి బాగా డిమాండ్ వస్తోందన్నారు. చిన్న ఉపగ్రహాల ప్రయోగం కోసం కులశేఖర పట్నం లో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం.. రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news