Gold: బంగారానికి ఎంత డిమాండ్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మధ్యతరగతి నుంచి..హై క్లాస్ వరకూ.. పది మందిలో.. మిమ్మల్ని ప్రత్యేకంగా చూపించేది బంగారమే.. ఒంటిమీద ఎంత బంగారం ఉంటే.. వాళ్లు అంత వెనకేశారు అని మనం అనేసుకుంటాం. నాలుగు రూపాయిలు మిగిలితే చాలు.. ఆడవాళ్లు ఫస్ట్ బంగారం కొనలనే చూస్తారు. అయితే బంగారాన్ని ఆభరణాలుగా వేసుకుంటాం, బిస్కెట్‌లు చేసుకుంటాం, వస్తువులు ఉంటాయి.. కానీ తినడం గురించి మీకు తెలుసా..? తినే బంగారం కూడా ఉంటుందండీ..దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..
Edible గోల్డ్ జనాదరణ పొందుతోంది. బంగారాన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అసలే అక్షయ తృతీయ వస్తోంది. తినదగిన బంగారం ప్రయోజనాలను తెలుసుకునేందుకు ఇదే మంచి సమయం. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది సగటు ఆహారంలో ప్రధానమైనది కానప్పటికీ, తినదగిన బంగారం ఆరోగ్యాన్ని, శ్రేయస్సును మెరుగుపరిచే ఉపయోగకరమైన పోషక ప్రయోజనాలతో నిండి ఉందట..
తినదగిన బంగారం ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి దాని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు. తినదగిన బంగారం అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంది. ఇది వాపును తగ్గిస్తుంది, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది, టాక్సిన్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షింస్తుంది. తినే బంగారంలో కూడా అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉన్నాయి.. ఇది పోషకాహారానికి గొప్ప మూలం. ఇందులో విటమిన్ ఏ, సీ, ఇ, అలాగే మెగ్నీషియం, ఐరన్, జింక్ ఉన్నాయని అంటున్నారు. ఈ విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి, శక్తిని అందించడానికి సహాయపడతాయి
తినదగిన బంగారం డైటరీ ఫైబర్ యొక్క గొప్ప మూలం. ఇది జీర్ణక్రియను నియంత్రించడంలో, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది
వృద్ధాప్యం రాకుండా ఈ బంగారం పోరాడుతుందట. ముడుతలను తగ్గించడానికి, చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి, వయస్సు మచ్చల రూపాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని అధ్యయనాల ద్వారా కనుగొన్నారు. తినదగిన బంగారంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని పర్యావరణ నష్టం నుంచి రక్షించడంలో, యవ్వనంగా కనిపించేలా చేయడంలో సహాయపడతాయట.
తినే బంగారం ఎలా తయారుచేస్తారు.?
ఈ బంగారాన్ని(Gold) ఉత్పత్తి చేయడానికి స్వచ్ఛమైన బంగారాన్ని 2,000 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పైగా కరిగించి ఒక బార్‌లో పోస్తారు. బార్ ఒక నిర్దిష్ట మందాన్ని చేరుకున్నప్పుడు అది .0001 మిల్లీమీటర్ల మందం వచ్చే వరకు పౌండ్ చేయబడుతుంది. తినేందుకు వీలైన బంగారం పలుచని రేకులా ఉంటుంది. ఈ రేకుల్ని 5,000 ఏళ్ళ క్రితమే ఈజిప్షియన్లు తయారు చేయటం ప్రారంభించారట. తినదగిన బంగారం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు. అలాగే భోజనానికి ప్రత్యేకమైన విలాసవంతమైన టచ్‌ను జోడిస్తుంది. ఇలా లగ్జరీ డైనింగ్ కోసం ఎక్కువగా బంగారాన్ని ఉపయోగిస్తారు.
బంగారం ఏదైనా బంగారమే కదా అని.. మీ దగ్గర ఉన్న బంగారాన్ని తింటే.. ఈ ప్రయోజనాలు అన్నీ వస్తాయి అనుకుంటే పొరపాటే.. రెండు వేర్వేరు.. అనవసరంగా తిని ప్రాణాల మీదకు తెచ్చుకోకండి..!