పార్లమెంటుకు వెళ్లేది పరిచయాల కోసం.. ప్రజల కోసం పని చేయడానికి అని గుర్తుంచుకోవాలన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. పోటీ చేయని నేతలు కూడా అసెంబ్లీకి వెళ్తున్నట్టే. రక్తం ధారపోసిన జనసైనికులు.. గడప దాటని వీర మహిళలు పార్టీని గెలిపించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండేటువంటి విజయం సాధించాం. ఇల్లు అలకగానే పండుగ కాదు.. పండుగ చేసుకునే సమయం కాదు. ఇది బాధ్యతతో ఉండాల్సిన సమయం.
విజయంతో వచ్చే అతిశయం నాకు లేదు.. పార్టీలో ఎవ్వరూ పెట్టుకోవద్దు. కేంద్రంలో కీలక భాగం కాబోతున్నాం.. ఎంపీలు ఉదయ్, బాలసౌరీకి చాలా బాధ్యత ఉంది. ఢిల్లీలో జనసేన ఎంపీల కదలిక.. కామెంట్లను ప్రతి ఒక్కరూ పరిశీలిస్తారు. ఏపీ ప్రజల తరపున లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఇది అద్భుతమైన విజయం. పోటీ చేసిన స్థానాలన్నింటినీ గెలుచుకోవడమనేది దాదాపు అసాధ్యం. ఈసారి ఎన్నికలను నడిపింది.. పవన్ తర్వాత సామాన్య జనసైనికులే.