జగన్ కాలుమీద వెంట్రుక కూడా పీకలేరు – మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత నారా చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. సీఎం జగన్ కాలిపై వెంట్రుక కూడా పీకలేరని అన్నారు. పవన్ కళ్యాణ్ ఇరిటేషన్ స్టార్, చంద్రబాబు ఇమిటేషన్ స్టార్ అని.. సీఎం జగన్ ఇన్స్పిరేషన్ స్టార్ అని అన్నారు. రికార్డులు సృష్టించాలన్నా, ఆ రికార్డులను తిరగరాయాలన్నా జగన్ కే సాధ్యమని అన్నారు.

ఇవాళ చంద్రబాబు సిగ్గుపడాల్సిన రోజు అని.. తన హెరిటేజ్ సంస్థ కోసం విజయ డైరీ మూయించిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. “హాయ్ ఏపీ.. బాయ్ బాయ్ బిపి ( బాబు, పవన్).. వన్స్ అగైన్ వైఎస్ఆర్సిపి” అన్నారు రోజా. ఎంతమంది పవన్ కళ్యాణ్ లు వచ్చినా మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. జగన్ ని మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు కసితో ఉన్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news