ఈ వైసీపీ ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ ఇమేజ్ ఒక్క‌టే ర‌క్షా…!

-

చిత్తూరు జిల్లా…టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా.. పేరుకు మాత్రమే చంద్రబాబు సొంత జిల్లా కానీ ఆధిక్యం జగన్‌దే. ఈ జిల్లాలో టీడీపీ కంటే వైసీపీనే బాగా స్ట్రాంగ్. అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకే రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్న 2014 ఎన్నికల్లో సైతం చిత్తూరులో వైసీపీ హవానే నడిచింది. మొత్తం 14 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 8 గెలిస్తే, టీడీపీ 6 చోట్ల గెలిచింది. ఇక రెండు ఎంపీ సీట్లలో ఒకటి వైసీపీ, ఒకటి టీడీపీ గెలిచాయి. 2019 ఎన్నికలోకొచ్చేసరికి జిల్లాలో జగన్ వేవ్ నడిచింది. వైసీపీ 13 సీట్లు గెలిస్తే, కేవలం కుప్పంలోనే బాబు గెలిచారు. రెండు ఎంపీ సీట్లు కూడా వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. కుప్పంలో కూడా చంద్ర‌బాబు మెజార్టీ కేవ‌లం 30 వేలు మాత్ర‌మే. అది కూడా ప్రారంభ రౌండ్ల‌లో ఆయ‌న వెన‌క‌ప‌డి త‌ర్వాత పుంజుకుని గెలిచారు.

CM JAGAN
CM JAGAN

ఇక బాబు ఇలాకాలో కూడా ఇంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలవడానికి ప్రధాన కారణం జగన్ ఇమేజ్ మాత్రమే. అసలు తొలిసారి పోటీ చేసినవారు సైతం భారీ మెజారిటీలతో గెలిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 16 నెలలు కావొస్తుంది. ఈ 16 నెలల కాలంలో 13 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సొంత ఇమేజ్ తెచ్చుకున్నారా? అంటే చెప్పడం చాలా కష్టం. ఓ నలుగురైదుగురు నేతలని పక్కనబెడితే, మిగతా వారు అసలు హైలైట్ కావడం లేదు. ఎన్నికల్లో ఏదో టీడీపీ మీద వ్యతిరేకిత, జగన్ వేవ్ కారణంగా వారు ఎమ్మెల్యేలుగా గెలిచేశారు. పోనీ అలా గెలిచిన వాళ్ళు మంచి పనితీరు కనబరిచి, జగన్ ఇమేజ్ దాటి, సొంత ఇమేజ్ తెచ్చుకోలేదు. ఇప్పటికీ ఎమ్మెల్యేలని జగన్ ఇమేజ్ మాత్రమే కాపాడుతోంది.

సంక్షేమ పథకాల వల్ల, టీడీపీ నేతలు సరిగ్గా యాక్టివ్‌గా లేకపోవడం వల్ల వైసీపీ ఎమ్మెల్యేల బండి నడుస్తోంది. లేదంటే వారిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకిత వచ్చేది. పెద్దిరెడ్డి, రోజా లాంటి ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్లను ప‌క్క‌న పెట్టేస్తే జిల్లాలో మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేల ఉలుకు, ప‌లుకు కూడా ఉండ‌డం లేదు. అయితే రానున్న రోజుల్లోనైనా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ఇమేజ్‌ని దాటి, సొంత ఇమేజ్ తెచ్చుకుంటే బాగుంటుంది. లేదంటే జగన్ ఎంత కష్టపడిన పెద్ద ప్రయోజనం ఉండదని విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు.

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Latest news