ఏపీ రైతులకు సీఎం జగన్ తీపికబురు చెప్పారు. అక్టోబర్ 26 వ తేదీన రైతు భరోసా రెండో విడత డబ్బులు రిలీజ్ చేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎవరైన అర్హులై, డబ్బులు రాకపోతే.. అప్లై చేసుకోవాలని సూచనలు చేశారు సీఎం జగన్. అలాగే.. డిసెంబర్ లో 5 లక్షల ఇండ్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో గడప గడపకూ మన ప్రభుత్వం నిర్వహించిన నెల రోజుల్లో ప్రాధాన్యతా పనులు మొదలు కావాలని ఆదేశించిన సీఎం జగన్.. అక్టోబరు 25న ఇ–క్రాపింగ్ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్ వివరించారు.
ఉపాధి హామీ పథకం కింద కనీసం వేతనం రూ.240 లు అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్ 25 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్.. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్ –3 కింద డిసెంబర్లో ఇళ్ల మంజూరు చేయాలని పేర్కొన్నారు.