జగన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధిపై ఎటువంటి ఆలోచన లేదు – నారా లోకేష్

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మదనపల్లిలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధిపై ఎటువంటి ఆలోచన లేదన్నారు. అధికారంలోకి వచ్చాక కూల్చివేతలు, ఉన్న కంపెనీలను బెదిరించి పంపడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదని విమర్శించారు. మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలను పూర్తిగా దివాలా తీయించారని.. కనీసం కరెంట్ బిల్లులు కూడా కట్టలేని దుస్థితికి తీసుకు వచ్చారని మండిపడ్డారు.

రాష్ట్రంలో వేలకోట్ల రూపాయల ప్రముఖ ట్రస్టులు, ఎయిడెడ్ భూముల ఆస్తులను కొట్టివేయాలన్న దుర్బుద్ధితోనే జగన్ ప్రభుత్వం విలీనం నాటకానికి తెరలేపిందని ఆరోపించారు. ఇదిలా ఉంటే మరోవైపు లోకేష్ పాదయాత్రలో జేబుదొంగలు హల్చల్ చేశారు. పాదయాత్రలో తమ పరిసరాలు పోగొట్టుకున్నామని పలువురు టిడిపి నేతలు వాపోయారు. దీంతో పాదయాత్రలో పాల్గొన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని నేతలు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news