ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి జగన్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి నోటీసులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారంలోగా చెప్పాలన్న ప్రభుత్వం.. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
![cm jagan](https://cdn.manalokam.com/wp-content/uploads/2022/05/move-review-ppas-only-to-ensure-competitive-prices-cm-jagan-mohan-reddy.jpg)
గవర్నర్ కు ఫిర్యాదు చేయటం రూసా నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయటానికి అనేక మార్గాలు ఉన్నా ఎందుకు ఉపయోగించుకోలేదని ప్రశ్నించింది జగన్ ప్రభుత్వం. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసు జారీ చేశామన్న ప్రభుత్వం.. ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేసింది.