ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడితోనే సిఐ చనిపోయాడు – జేసీ ప్రభాకర్‌ రెడ్డి

-

తాడిపత్రి పట్టణ సిఐ ఆనందరావు ఒత్తిడి తట్టుకోలేక చనిపోయాడని…దానికి కారణం ఎమ్మెల్యే పెద్దారెడ్డి అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి. పోలీస్ అసోసియేషన్ ఎక్కడ ఉందని… గతంలో మా అన్న దివాకర్ రెడ్డి ఏదో అన్నారని ఇష్యూ చేశారని ఆగ్రహించారు. ఇప్పుడు ఒక సిఐ చనిపోతే అసోషియేషన్ ఎక్కడ పోయిందని.. ప్రభుత్వం నుంచి సహాయసహకారులు అందవని బెదిరిస్తారా అని నిలదీశారు.

మా నాన్న తాడిపత్రిలో పనిఒత్తిడి కారణంగా ఇబ్బంది పడుతున్నానని సిఐ కుమార్తె చెప్పిందని.. ఓ కేసులో వ్తెసీపీ నాయకుడు పేరు తొలగించాలని సిఐప్తె ఒత్తిడి చేశారన్నారు. తెల్లవారుజామున 4:10 కి ఏమి పని ఉందని ఆత్మహత్య చేసుకున్న సిఐ ఆనందరావు ఇంటికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లారని.. సెల్ ఫోన్లలో డేటాను డిలీట్ ఎందుకు చేశారని ఫైర్‌ అయ్యారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే సిఐ చనిపోయాడని…పోలీసు పరిధి కాకపోయినా సిఐ ఆనందరావుతో డ్యూటీ చేయించారని ఆరోపించారు. చంద్రబాబుతో మాట్లాడాను… సిఐ ఆనందరావు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరాను… కుటుంబాన్ని ఆదుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news