ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై ఉద్యోగ సంఘాలు నేడు పీఆర్సీ పై చర్చించడానికి సమావేశం కానున్నారు. నేడు సాయంత్రం 5 గంటలకు ఏపీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం తో భేటీ కానున్నాయి. ఈ సమావేశం లో ప్రభుత్వం నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తో పాటు పలువురు ఆర్థిక శాఖ అధికారులు పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పీఆర్సీ పై స్పష్టత రానుంది. కాగ ఇప్పటికే పలు మార్లు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో పీఆర్సీ పై సమావేశం అయ్యాయి.
కాగ నేడు మరో సారి సమావేశం అయి పీఆర్సీ ని ఒక కొలక్కి తీసుకువచ్చే అవకాశం ఉంది. కాగ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు తమ 71 డిమాండ్ల ను పరిష్కరించాలని పట్టు పడుతున్నారు. అలాగే పీఆర్సీ ని కూడా 40 శాతం వరకు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కాగ ప్రభుత్వం మాత్రం మధ్యంతర భృతి 27 శాతం కంటే కాస్త ఎక్కువ ఇస్తామని ప్రకటించింది. దీంతో ఉద్యోగ సంఘాలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గందరగోళ పరిస్థితి నెలకొంది.