సర్వేపల్లి వైసీపీ టికెట్ కాకాణికే రావాలి -TDP సోమిరెడ్డి

-

సర్వేపల్లి వైసీపీ టికెట్ కాకాణికే రావాలని సోమిరెడ్డి సెటైర్లు పేల్చారు. మంత్రి కాకాణి సెటైర్లకు సోమిరెడ్డి స్పందించారు. సర్వేపల్లి వైసీపీ టికెట్ కాకాణి గోవర్ధన్ రెడ్డి కే రావాలి….ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే జిల్లా లోని నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ని వైసీపీ నుంచి తరిమేశారంటూ చురకలు అంటించారు. సర్వేపల్లి వై.సి.పి టికెట్ ఆయనకు రావడం అనుమానమని చెబుతున్నారు…నేనైతే కాకాణికి సర్వేపల్లి వైసీపీ టికెట్ రావాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.

kakani govardan reddy vs somireddy

ఎందుకంటే…కొత్త అభ్యర్థి వస్తే చెప్పుకునే దానికి ఏమీ లేవు…కాకాణికైతే నకిలీ పత్రాలు, నకిలీ మద్యం, దళితుల భూములు, కృష్ణపట్నం పోర్టు, గ్రావెల్, క్వార్ట్జ్, మట్టి దోపిడీ లాంటివి ఎన్నో గొప్పలు చెప్పుకోవచ్చు అంటూ చురకలు అంటించారు. జగన్ త్వరగా సర్వేపల్లి వైసీపీ అభ్యర్థిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరును ప్రకటించాలని కోరుతున్నానన్నారు సోమిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version