షిప్ సీజ్ పై కస్టమ్స్ అధికారుల రియాక్షన్..!

-

కాకినాడ పోర్టు నుండి సముద్రంలోకి వెళ్లి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ షిప్ ను సీజ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. అందులో రేషన్ బియ్యం వేరే దేశానికి తరలిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ ఆ షిప్ ను సీజ్ చేయించారు. ఆ తర్వాత పోర్టు భద్రతపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేసారు. అయితే తాజాగా కాకినాడ కస్టమ్స్ అధికారులు ఈ ఘటన పై స్పందించారు. ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం ధ్రువీకరించడంలో కస్టమ్స్ పాత్ర ఉండదు. బియ్యం పోర్ట్ లోకి వచ్చిన తర్వాత కస్టమ్స్ బాధ్యత తీసుకుంటుంది అని పేర్కొన్నారు.

అలాగే ఎగుమతి కోసం పిడిఎస్ బియ్యాన్ని మళ్లించే కార్యకలాపాలకు ఎగుమతి దారులు సపోర్ట్ చేయకూడదు. రేషన్ రైస్ అని అనుమానం ఉంటే ఎక్స్ పోర్టర్స్ లోడ్ ఆపేయాలి. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు కస్టమ్స్ సహకరిస్తుంది. షిప్పింగ్ బిల్లు, ఇన్ వాయిస్ ప్యాకింగ్ లిస్టు, కాంట్రాక్టు కాపీ ఉందో లేదో ధ్రువీకరించడము కొరకు మాత్రమే కస్టమ్స్ అధికారులను పరిమితం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి కస్టమ్స్ పూర్తి సహకారం అందిస్తుంది అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version