ఒకసారి..ఏపీలో తొంగి చూడు హరీష్ రావు – మంత్రి కార్మూరి కౌంటర్

-

తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఏపీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారని..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి తొంగి చూడు హరీష్ రావు అంటూ ఆగ్రహించారు. ప్రతి ఇంట్లోనూ మళ్ళీ జగన్ రావాలి అంటున్నారన్నారు. ఇక్కడ ఏ స్థాయిలో అభివృధ్ధి జరుగుతుందో రాష్ట్ర ప్రజలకు తెలుసు అని హరీష్ వ్యాఖ్యలకు మంత్రి కార్మూరి కౌంటర్ ఇచ్చారు.

ఇక అటు కొత్తగా ఎన్నికైన మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు కార్మూరి. మొత్తం 21 స్థానాల్లో ఎన్నికలు జరిగితే వైసీపీ 17 సాధించింది.. నాలుగు స్థానాల్లో గెలిచి టీడీపీ హడావిడి చేసిందని వివరించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సున్నాకే చతికిలపడుతుంది.. ఇదే అవకాశం చంద్రబాబుకు వచ్చి ఉంటే వేల కోట్లు సంపాదించి ఉండేవాడన్నారు. ఎమ్మెల్సీ స్థానాలను డబ్బులకు అమ్ముకుని ఉండేవాడు.. బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లకు డబ్బులు ఇచ్చారా అని అడుగుతున్నారు?? అని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news