తెలుగుదేశం పార్టీపై విజయవాడ ఎంపీ కేశినాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రక్షాళన జరగాలని చీటర్లు, రియల్ ఎస్టేట్ మోసాలు చేసిన వారు కాల్ మనీ గాళ్ళకు ఎన్నికల్లో టిడిపి తరఫున టికెట్ ఇవ్వొద్దన్నారు. తన తమ్ముడి చిన్ని, మరో ముగ్గురికి టికెట్ ఇస్తే వారికి తాను మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పారు. నాకంటే కేశినేని, చిన్ని ఆక్టివ్ గా ఉంటే మంచిదేనన్నారు.
ల్యాండ్ గ్రాఫర్లు, ఉమెనైజర్లకు సీటు ఇచ్చి పార్టీ సిద్ధాంతాన్ని పక్కదారి పట్టించొద్దని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీ స్థాయి నాయకుడినని, తన సేవలు కావాలంటే పార్టీ వాడుకోవచ్చని తెలిపారు. పార్టీ మంచి క్యారెక్టర్ ఉన్నోడికి టికెట్ ఇస్తే, ఎంపీని చేస్తానని పేర్కొన్నారు. తాను ఎంపీ అయితేనే ఈ స్థాయి రాలేదని, తనకు బ్రాండ్ ఉందన్నారు. ఎన్టీఆర్ గొప్ప ఆశయాలతో టీడీపీని స్థాపించారని, ఎవరికి పడితే వారికి టికెట్లు ఇచ్చి పార్టీ సిద్ధాంతాన్ని చెడగొట్టొద్దని వ్యాఖ్యానించారు.