హిందూపురం వైసీపీలో కీలక పరిణామాలు..దీపికకు కీలక బాధ్యతలు

-

హిందూపురం వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ సమన్వయకర్తగా దీపిక నియామకం అయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జిగా బీసీ మహిళ దీపిక పేరును అధిష్టానం ఖరారు చేసిన కొన్ని గంటల్లోనే ఎమ్మెల్సీ ఇక్బాల్ వీడియో రిలీజ్ చేశారు. హిందూపురం వైసీపీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసిన ఇక్బాల్… పార్టీ ఒక నిర్ణయం తీసుకొని హిందూపురం ఇన్చార్జిగా దీపికను నియమించడం జరిగిందన్నారు.

పార్టీ నిర్ణయం శిరోధార్యం.పార్టీ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటామన్నారు. నేను వ్యక్తిగత పనులు నిమిత్తం కొద్దిరోజుల పాటు హైదరాబాదుకు వెళుతున్నానని.. పార్టీ పటిష్టత కోసం పనిచేసి 2024లో వైసిపి జెండాఎగరవేయాలని ఆశిస్తున్నా అని తెలిపారు. ఈ నాలుగేళ్లలో హిందూపురం ప్రజల బాగోగుల కోసం ఎంతో కృషి చేశానని.. ఏదో కొన్ని లోపాలు ఉండవచ్చు. ఆప్రాంత ప్రజలు క్షేమంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news