పార్టీ బాధ్యతలు NTR కు అప్పగిస్తే, టీడీపీ ప్రతిపక్షంలోనైనా ఉంటుందంటూ హాట్ కామెంట్స్ చేశారు ఏపీ మాజీ మంత్రి వర్యులు కొడాలి నాని. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి జూ.ఎన్టీఆర్‌ను నారా లోకేష్ ఆహ్వానించడం ఏంటి? పార్టీని కాపాడటం తమ వల్ల కాదని చంద్రబాబు, లోకేష్‌కు అర్థమైంది.. తమ విశ్వసనీయతపై తమకే నమ్మకం లేక జూ.ఎన్టీఆర్‌ను ఆహ్వానిస్తున్నారన్నారు కొడాలి నాని.
పార్టీ బాధ్యతలు జూనియర్‌కు అప్పగిస్తే టీడీపీ ప్రతిపక్షంలోనైనా ఉంటుంది.. 2009 తర్వాత జరిగిన మహానాడులో లోకేష్ కోసం జూ.ఎన్టీఆర్‌ను అవమానించారు.. తనను వాడుకుని ఆ తర్వాత ఎలా అవమానించారో జూనియర్‌కి తెలియదా? అని నిలదీశారు. చంద్రబాబు చేసే అవమానం ఎలా ఉంటుందో జూ.ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేశారు.. ఎన్టీఆర్ పేరు పది కాలాలపాటు వినిపించాలంటే, పార్టీ బాధ్యతలు జూ.ఎన్టీఆర్‌కు ఇవ్వాలన్నారు కొడాలి నాని.