లిక్కర్‌ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడు లేరు – కొడాలి నాని

-

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడు లేరని కుండ బద్దలు కొట్టి చెప్పారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని. లిక్కర్‌ స్కాంలో అరెస్టయిన వారిలో విజయసాయిరెడ్డి అల్లుడు లేరు.. అరబిందో సంస్థతో నీకు సంబంధం లేదని ప్రమాణం చేయగలవా చంద్రబాబు? 2004-19 వరకు అరబిందో నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్‌ వసూలు చేశారన్నారు కొడాలి నాని.


2024 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ జెండా పీక్కొని పారిపోతాడని చురకలు అంటించారు. చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు జీవిత కాలం సమయం ఇస్తున్నాం. పులివెందులలో ఒక్క పంచాయతీ అయినా గెలవగలరా? అని ఛాలెంజ్‌ చేశారు. నారావారిపల్లెలో గెలవలేని చంద్రబాబు కుప్పంలో ఎలా గెలుస్తాడు? అని ప్రశ్నించారు కొడాలి నాని. చంద్రబాబు రిటైర్‌ అయిపోవడం ఖాయమని జోష్యం చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news