మంత్రి పెద్దిరెడ్డి గ్యాంగ్ గుండాయిజం చేస్తోంది – నారా లోకేష్

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెద్దిరెడ్డి పాడి రైతుల పాలిట పాపాల భైరవుడు అయ్యారని లోకేష్ విమర్శించారు. పెద్దిరెడ్డికి చెందిన సొంత శివశక్తి డైరీ అన్ని డైరీలు, సహకార సంఘాల కంటే లీటర్ పాలకి అతి తక్కువ ధర ఇస్తుందని ఆరోపించారు. ఎక్కువ ధర ఇచ్చే డైరీలో పాలసేకరణకు వస్తే వారిపై పెద్దిరెడ్డి గ్యాంగ్ గుండాయిజం చేస్తోందని లోకేష్ ఫైర్ అయ్యారు. ఇదేంటని ప్రశ్నించిన రైతులను బెదిరింపులతో భయపెడుతున్నారని లోకేష్ పేర్కొన్నారు.

పెద్దిరెడ్డి పాపాలు చేయడంలో శిశుపాలున్నీ మించిపోయారని ఆరోపించారు. పెద్దిరెడ్డి గ్యాంగ్ బెదిరింపులకు భయపడిన శ్రీజ డైరీ నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని వివరించారు. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం వల్లిగట్ట గ్రామ పాడి రైతులు శ్రీజ డైరీ కి పాలు పోస్తుండే వారనీ.. అయితే పెద్దిరెడ్డి కి చెందిన శివశక్తి డైరీ మేనేజర్ పురుషోత్తం రెడ్డి శ్రీజ డైరీ వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు.