సీఎం జగన్ తో భేటీ అయిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి…

-

నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ బలహీనపడుతుందన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలపై జగన్ మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పడానికి ప్రణాళికలు రచిస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల వైసీపీ నుండి బహిష్కరించిన కోటంరెడ్డి మరియు ఆనం రామనారాయణ రెడ్డి లు ఇంచార్జి లుగా ఉన్న నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జి లను నియమించాడు. ఇక అదే పనిలో ఉదయగిరి వైసీపీ ఇంచార్జి ను నియమించడానికి కొంత గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఉదయగిరి ఇంచార్జి గా ఎవరిని నియమిస్తారో అన్న సందిగ్ధంలో ఉండగానే.. ఈ రోజు జరిగిన ఒక భేటీ ఒక సమాధానమా అని తెలుస్తోంది. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి తాజాగా సీఎం జగన్ ను కలవడం జరిగింది.

మరి ఈ భేటీలో ఉదయగిరి నియోజకవర్గం కు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు అని బహిస్కరించారు.

Read more RELATED
Recommended to you

Latest news