మల్లన్నని ఆపేది ఎవరు? మేడ్చల్‌లో తిరుగులేనట్లేనా?

-

మల్లన్న: మల్లారెడ్డి..తెలంగాణ రాజకీయాల్లో క్రేజ్ ఉన్న నాయకుడు..తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ జనాలని ఆకట్టుకునే నేత..కే‌సి‌ఆర్, కే‌టి‌ఆర్‌లని ఎప్పుడు పొగుడుతూ..ప్రత్యర్ధులపై పంచ్‌లు వేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఆయన డైలాగులు బాగా ఫేమస్ అయిపోయాయి. దీంతో జనంలో బాగా క్రేజ్ వచ్చింది. ఇలా క్రేజ్ ఉన్న మల్లారెడ్డి నెక్స్ట్ ఎన్నికల్లో గెలుస్తారా? మళ్ళీ మేడ్చల్ బరిలో తిరుగులేని విధంగా గెలుస్తారా? అంటే గెలిచే అవకాశాలు మాత్రం మెండుగానే ఉన్నాయని చెప్పవచ్చు.

కింది స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చిన మల్లారెడ్డి..విద్యాసంస్థలతో దూసుకొచ్చిన మల్లారెడ్డి..రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి 2014లో టి‌డి‌పి నుంచి పోటీ చేసి మల్కాజిగిరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత తెలంగాణలో టి‌డి‌పి దెబ్బతినడంతో బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి బరిలో దిగారు.

మేడ్చల్ చరిత్రలో లేని విధంగా దాదాపు 87 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి మల్లన్న చరిత్ర సృష్టించారు. ఈ సారి కూడా మల్లన్న మేడ్చల్ బరిలో దిగడానికే రెడీ అవుతున్నారు. అయితే మేడ్చల్ లో గతంలో కాంగ్రెస్, టి‌డి‌పి సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. 1985, 1994, 1999, 2004 ఎన్నికల్లో టి‌డి‌పి గెలిచింది..మిగిలిన సార్లు కాంగ్రెస్ గెలిచింది. 2014 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ విజయం సాధించింది.

2018లో మల్లన్న బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి సత్తా చాటారు. అయితే మంత్రి కూడా అయిన మల్లన్న మేడ్చల్ ని అభివృద్ధి బాటపట్టించారు. ప్రజల మద్ధతు తగ్గకుండా చూసుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్, బి‌జే‌పిలు సైతం రేసులోకి వస్తున్నాయి. అదే సమయంలో కొంతమేర టి‌డి‌పి ఓటింగ్ ఉంది. టి‌డి‌పి పోటీ చేస్తే ఓట్లు చీల్చే అవకాశం ఉంది. అది కాస్త మల్లన్నకు నష్టం చేయవచ్చు. కానీ కాంగ్రెస్, బి‌జే‌పిల మధ్య ఓట్లు చీలి మళ్ళీ మల్లన్న గెలుపు దక్కే అవకాశం ఉంది. మొత్తానికైతే మేడ్చల్ లో మల్లన్నకు మళ్ళీ గెలిచే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news