అంబేద్కర్ విగ్రహంపై దాడి ఒక చీకటి రోజు అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. టీడీపీ ప్రభుత్వం హయంలో అంబేద్కర్ విగ్రహం పెట్టమని అడిగితే దాడులు చేశారు, కేసులు పెట్టారు. అంబేద్కర్ విగ్రహంని ఎక్కడో ముళ్ల పొదల్లో పెట్టేందుకు ప్రయత్నం జరిగింది. కానీ 400కోట్లు కు పైగా ఖర్చు చేసి జగన్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. కానీ గవర్నర్ బంగ్లా, పోలీసు కమిషనర్ కార్యాలయం పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం పై గునపలు, ఇనుప రాడ్ల తో దాడి చేశారు.
కాబట్టి అంబేద్కర్ విగ్రహం ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ విగ్రహంని కులదోసే ప్రయత్నం కూడా జరగవచ్చు. ఈ ఘటనకి చంద్రబాబు బాధ్యత వహించాలి. జగన్ కు పేరు వస్తుందనే టీడీపీ నాయకులు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. అయితే అంబేద్కర్ విగ్రహం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పై నమ్మకం లేదు.. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబు కు అలవాటు. కాబట్టి కేంద్ర బలగాలతో అంబేద్కర్ విగ్రహంకు భద్రత కల్పించాలి అని మేరుగ నాగార్జున పేర్కొన్నారు.