చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్….ఆన్ స్క్రిల్డ్ పొలిటీషియన్ – మంత్రి అమర్నాథ్

-

చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి అమర్నాథ్ ఘాటు కామెంట్స్ చేశారు. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్….ఆన్ స్క్రిల్డ్ పొలిటీషియన్ అని… చంద్రబాబు చేసిన పాపాలు, దోపిడీకి అరెస్ట్ ఒక నిదర్శనమంటూ మండిపడ్డారు. 370 కోట్ల ప్రజాధనం వ్యక్తిగత స్వార్ధం కోసం వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని.. కాస్టోడియన్ గా ఉండాలిసిన ప్రజాప్రతినిధి కంచె చెను మేసినట్టు స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ లో బయటపడిందన్నారు.

Minister Amarnath on chandrababu arrest

చంద్రబాబు తేలుకుట్టిన దోంగ….అందుకే నా తప్పు లేదని ఎక్కడా చెప్పలేకపోతున్నారని.. స్కిల్ స్కామ్ యూరో లాటరీ వంటి మోస పూరిత ఆలోచనల్లో నుంచి పుట్టిందని పేర్కొన్నారు. చంద్రబాబు క్రిమినల్ స్కిల్ తప్ప రాష్ట్రంకు ఎటువంటి లబ్ది చేకూరలేదు….సీ మేన్స్ స్కామ్ లో ఎంత మంది పాత్రధారులు వున్నా….. ప్రధాన సూత్రధారి మాత్రం చంద్రబాబు నాయుడే అంటూ ఫైర్ అయ్యారు. ప్రజల ఆస్తిని దోపిడీ చేసిన వాళ్ళను అరెస్ట్ చేస్తే ఆందోళన చేయడానికి టీడీపీ నేతలకు సిగ్గు లేదా….? అంటూ ఆగ్రహించారు మంత్రి అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version