నిర్ణయంపై నమ్మకం అంటే ఇలా ఉండాలి… అవంతి ఛాలెంజ్ సూపర్!!

-

మనం చేసే ఛాలెంజ్ అనేది.. మనపై మనకున్న నమ్మకంతోపాటు, మనం తీసుకున్న నిర్ణయంపై కూడా అంతబలమైన నమ్మకాన్ని కలిగిఉండాలి. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్న పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు సంబందించి వైకాపా నేతల్లో బలమైన నమ్మకం ఉంది. తాము తీసుకున్న నిర్ణయం ప్రజామోగ్యమైనది, ప్రజలు హర్షించేది, మేదావులు మెచ్చుకునేది అని జగన్ తో పాటు అదేస్థాయిలో బలంగా నమ్మిన వైకాపా నేతలు… టీడీపీకి దిమ్మతిరిగే ఛాలెంజ్ లు విసురుతున్నారు.. ఫలితంగా తమ నిర్ణయంపై తమకు ఎంత నమ్మకం ఉందో చెప్పకనే చెబుతున్నారు! ఇందులో భాగంగా తాజాగా మంత్రి అవంతీ శ్రీనివాస్ సూపర్ ఛాలెంజ్ విసిరారారు!

ఛాలెంజ్ లంటే… మీరు రాజినామాలు చేయండి, మేము చేస్తాం… మీరు అసెంబ్లీని రద్దు చేయండి, మేము ఎన్నికల్లో మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకుంటాం.. వంటి పిల్ల ఛాలెంజ్ లు గతకొన్ని రోజులుగా చంద్రబాబు ఆన్ లైన్ వేదికగా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… మైకందుకున్న ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్… “మూడు రాజధానులు రిఫరెండంగా విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి.. వారిలో ఒక్కరు గెలిచినా పదవికి రాజీనామా చేస్తా” ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. దీంతో… తమ అధినేత తీసుకున్న నిర్ణయంపై అవంతికి ఉన్న నమ్మకానికి ఇది ఉదాహరణ అని.. ఇది సూపర్ ఛాలెంజ్ అని అంటున్నారు విశ్లేషకులు!

అనంతరం బాబుపై నిప్పుల వర్షం కుర్పించిన అవంతి… చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన ఉండదని.. విశాఖకు రాజధాని వద్దు అన్నందుకే చంద్రబాబును అక్కడ కాలుమోపనీయని విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. అమరావతిని మీరు మాటల్లో చెబుతున్న రేంజ్ లో అభివృద్ధి చేసిఉంటే… లోకేష్‌ ను అక్కడి ప్రజలు ఎందుకు ఓడించారో చెప్పాలని తెలిపారు. కాగా… విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో మృతి చెందినవారి కుటుంబాలను బాబు ఇప్పటివరకూ పరామర్శించింది లేదు!

Read more RELATED
Recommended to you

Latest news