మంత్రి అవంతికి కరోనా.. వైసీపీ నేతల్లో టెన్షన్..!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సామాన్య ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారినపడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా.. ఈ మహమ్మారి బారిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పడ్డారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు వెంకట శివసాయి నందీష్‌కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.

ఈ మేరకు మంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రస్తుతం వీరిద్దరూ వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు కరోనా టెస్ట్ చేయించుకోవాలని మంత్రి కోరారు. కాగా, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ మధ్య జోరుగా పాల్గొన్న మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో విశాఖపట్నం నేతల్లో టెన్షన్ నెలకొంది.