పీఎం ఈ వై 1.0లో కేటాయించిన 70శాతం ఇళ్ళ నిర్మాణం పూర్తి అయ్యింది అని మంత్రి పార్థసారథి తెలిపారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుక ను హౌసింగ్ డిపార్ట్మెంట్ కు ఇవ్వాలి. ఇసుక ట్రాన్స్ఫార్మెంట్ ను హౌసింగ్ విభాగమే చెల్లించేలా అదేశించాం. హౌసింగ్ నిర్మాణం, కేటాయింపుల్లో అవకతవకలపై జేసీ విచారణకు ఆదేశించాం. కుప్పంలో హౌసింగ్ బోర్డు నిర్మించిన ఇళ్లకు విద్యుత్ శాఖ, రెస్కో సమన్వయంతో పనిచేయాలని సూచించాం.. హౌసింగ్ కాలనీల్లో మౌలిక వసతులను కేంద్ర పథకాల నిధులతో చేస్తాం. బాధ్యతగా లక్ష్యం పూర్తి చేయాలని అధికారులను అదేశించాం.
అయితే బిల్లుల చెల్లింపుకు నిధుల కొరత లేదు. కానీ గత ప్రభుత్వ హయంలో హోసింగ్ లో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతోంది. నివేదిక వచ్చిన వెంటనే బాధితులపై చర్యలు తీసుకుంటాం. పీఎం ఈ వై 2.0 మార్చి నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించలనేది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం అని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.