ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ

-

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పేందుకు సిద్ధం అయ్యారు. ఏపీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం సోమవారం సాయంత్రం 4:30 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 2 లో సమావేశం అయింది.

ఈ జూలై నాటికి ప్రస్తుత పిఆర్సి గడువు పూర్తి కానుంది. ఈ సమావేశంలోనైనా డీఏ, పిఆర్సి బకాయిల చెల్లింపు, సిసిఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, తదితర అంశాలు ఓ కొలిక్కి వస్తాయో లేదో వేచి చూడాలి. గతంలో మార్చి 7వ తేదీన ఓసారి ఈ సమావేశం జరగగా.. నేటి సమావేశానికి 13 ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version