పార్టీ మార్పుపై మరోసారి క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే గంటా

-

టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారా? డిసెంబర్ రెండవ వారంలోనే ఆయన పార్టీ మారుతారని.. దానికి ముహూర్తం కూడా ఖరారు అయిందని ప్రచారం జరిగింది. కానీ రెండవ వారం దాటినా ఆయన పార్టీ మారలేదు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారా? లేదా? అనేదానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ వార్తలపై ఆయన స్వయంగా మరోసారి క్లారిటీ ఇచ్చారు.

ఆయన ఏమన్నారంటే..? ” ఆ ప్రచారంలో అసలు వాస్తవమే లేదు. అలాంటి సమాచారం ఏదైనా ఉంటే తప్పకుండా నేనే చెప్తా. అసలు నాకు తెలియకుండానే డేటు.. టైం కూడా ఫిక్స్ చేస్తారా? ఏం ప్రచారం చేసుకున్న నాకు సంబంధం లేదు. ఓ వివాహం సందర్భంగా నే కన్నా లక్ష్మీనారాయణ, బొండా ఉమా ఇతర నేతలను కలిశాను. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు ” అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news