విజయసాయి రెడ్డి పై ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్

వైసిపి కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డికి త్వరలోనే దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో తన పాత్ర బయటపడుతుందని భయంతోనే విజయసాయిరెడ్డి తన ఫోన్ పోయిందని నటిస్తున్నారని ఆరోపించారు.

తన ఫోన్ పోయిందని విజయసాయిరెడ్డి చెప్పడం చూస్తే ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆయనకు సంబంధం ఉన్నట్లేనని స్పష్టమవుతుందని ఆరోపించారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కి, విజయసాయి రెడ్డికి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయని.. శ్రీనివాస్ కి, తమ పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.