ఏపీలోనే సినిమా షూటింగ్లు, ఈవెంట్లు నిర్వహించాలి – విజయసాయిరెడ్డి

ఏపీలోనే సినిమా షూటింగ్లు, ఈవెంట్లు నిర్వహించాలని కోరారు వైసీపీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి. “ది ఘోస్ట్” ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏపీలో నిర్వహించడంపై వైసీపీ నేత విజయ సాయిరెడ్డి స్పందించారు.

యువ సామ్రాట్ నాగార్జున చిత్రం “ది ఘోస్ట్” ప్రీరిలీజ్ ఈవెంట్ కర్నూలులో నిర్వహించడం సంతోషమని చెప్పారు. ఆ సినిమా యూనిట్ కు నా శుభాభినందనలు అని తెలిపారు.

టాలీవుడ్ చిత్రాలకు 60% మార్కెట్ ఏపీ కాబట్టి… హీరోలు, నిర్మాతలు చొరవ తీసుకొని సినిమా ఈవెంట్లు, షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏపీలో నిర్వహించాలని కోరారు వైసీపీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి.ఇక మరో ట్వీట్‌ లో.. అసత్యాలతో, వ్యక్తులు, వ్యవస్థల ప్రతిష్టను దెబ్బతీసే ప్రచారాలతో కొందరి మనస్తత్వాలు సంతృప్తి పడుతుండొచ్చు. కాని సాధించేది ఏమీ ఉండదు. బురదలో జర్రున జారే వారికి శరీరం బరువు తెలియదు. పడిన తర్వాత ఎక్కడెక్కడ ఎముకలు విరిగి మంచాన పడాల్సి వస్తుందో అర్థమవుతుందన్నారు.