నేను బీజేపీతో ఉన్నానని ముస్లింలు నన్ను వదిలేస్తే నష్టపోతారు – పవన్ కళ్యాణ్

-

కాకినాడ: నేడు వారాహి విజయ యాత్రలో భాగంగా ముస్లింలతో సమావేశమయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ ముస్లీంలకు నచ్చదన్నారు. జగన్ క్రిస్టియన్ కాబట్టి ఆయనని నమ్మెచ్చని ముస్లీంలు అనుకుంటున్నారని.. నిజంగా అల్లాను ప్రార్థిస్తే… సత్యం చెప్పే వాడు ఒకడు మీకు తప్పకుండా కనిపిస్తాడని అన్నారు. పాకిస్తాన్ లో హిందూవులను చంపేశారు.. కానీ మన దేశంలో గౌరవించారని చెప్పుకొచ్చారు.

భారత్ లో 17 శాతం ముస్లీంలు ఉండటం అంటే సమాజం అందరినీ గౌరవిస్తోందనే అర్థం అన్నారు. తాను బీజేపీతో ఉన్నానని ముస్లీంలు తనని వదిలిస్తే మీరు నష్టపోతారని అన్నారు. ఇక నేడు ముమ్మడివరంలో వారాహి యాత్ర , సభలు జరగనున్నాయి. జూన్ 21, జూన్ 22న వరుసగా అమలాపురం, పి గన్నవరం నుంచి కొనసాగుతోంది. అనంతరం రాజోలు నియోజకవర్గం లో వారాహి యాత్ర, మకిలిపురంలో సభ నిర్వహించనున్నారు. చివరగా జూన్ 23న నరసాపురంలో వారాహి యాత్ర, సభ జరగనున్నాయి. ఇందుకోసం అవసరమైన అన్ని అనుమతులతో జనసేన పార్టీ వారాహి యాత్ర మరియు బహిరంగ సభలకు సిద్ధమైంది.

Read more RELATED
Recommended to you

Latest news