రోజా బెర్త్ ఖరారు అయినట్టే…?

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు దొరుకుతుంది ఏమిటనే దానిపై స్పష్టత రావడం లేదు. కొన్ని మార్పులు చేర్పులు ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకునే అవకాశాలు ఉండవచ్చని మీడియా వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా క్యాబినెట్ లోకి వెళ్ళే అవకాశం ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది.

గత కొన్ని రోజులుగా ఆర్.కె.రోజా సైలెంట్ గా ఉంటున్నారు. మీడియాతో కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. ఆమెతో పాటుగా చిత్తూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా పెద్దగా మాట్లాడటం లేదు. దీంతో వాళ్ళిద్దరూ పార్టీకి దూరంగా ఉంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మరో మంత్రి నారాయణస్వామి కారణంగా సైలెంట్ గా ఉంటున్నారు అంటూ వ్యాఖ్యలు వినిపించాయి.

దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి అనేది అర్థం కాలేదు. అయితే ఆర్కే.రోజా ఇప్పుడు కాస్త సీనియర్ నేతలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. సీనియర్ నేతలు ఆమె విషయంలో స్పందించక పోయినా సరే ఆమె మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే దీని వెనుక ఉన్న ప్రధాన కారణం మాత్రం మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే దూకుడుగా అడుగులు వేస్తూ సీనియర్ నేతలు విమర్శించారని తెలుస్తుంది. ముఖ్యమంత్రి జగన్ వద్ద మంచి మార్కులు కొట్టేయాలని అనే భావనలో ఆమె ఉన్నారని పార్టీ మీద తనకున్న నిబద్ధతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...