నాన్న, బాబాయ్ కి టికెట్ తీశాడు.. ఈ సారి గుండెపోటు తల్లికో! చెల్లికో? : జగన్ పై లోకేష్ సంచలన ట్వీట్

-

ఈ సారి గుండెపోటు తల్లికో! చెల్లికో? అంటూ ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పై నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. అసూయ కు మందు లేదని.. ఇంత అసూయతో ఉంటే త్వరగా గుండెపోటు, బీపీ లు వస్తాయని చురకలంటించారు. అలాంటి వారు త్వరగా టికెట్ తీసుకుంటారని వాళ్ళ మాటలు అస్సలు నమ్మకూడదని ఇవాళ జరిగిన వలంటీర్ల సన్మానం కార్యక్రమంలో సిఎం జగన్..అన్నారు.

అయితే సిఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా.. నారా లోకేష్ ట్వీట్ చేశారు. అసూయ కి అన్న లాంటి వాడు సిఎం జగన్ మోహన్ రెడ్డి అని.. అందుకే నాన్న, బాబాయ్ కి టికెట్ తీసి పంపేసాడు. మరోసారి ఆయన అసూయతో గర్వం దాల్చాడు. ఈ సారి గుండెపోటు తల్లికో! చెల్లికో? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. అంతే కాదు ఇవాళ సిఎం జగన్ మాట్లాడిన వీడియో ను టాగ్ చేశారు లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news