టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో ఈనెల 27 నుండి కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా లోకేష్ హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులర్పించారు. అంతకుముందు చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్న నారా లోకేష్ బంజారాహిల్స్ లోని ఇంటి వద్ద నుండి బైక్ ర్యాలీ ద్వారా ట్యాంక్ బండ్ కి చేరుకున్నారు.
అక్కడ నివాళులర్పించిన అనంతరం కడపకి బయలుదేరారు. కడపలో పెద్ద దర్గా ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం మరియాపురంలోని కేథలిన్ చర్చిని సందర్శించి ప్రార్థనలలో పాల్గొంటారు. కడప నుంచి బుధవారం సాయంత్రం బయలుదేరి తిరుమలలోని జిఎంఆర్ అతిథి గృహానికి వెళతారు. రాత్రికి అక్కడే బస చేసి 26వ తేదీ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు తిరుమల నుండి బయలుదేరి కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకుంటారు. 27 నుంచి యువగళం పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభిస్తారు.