బాబు అంటే బ్రాండ్… జగన్ అంటే జైలు – నారా లోకేష్

-

చంద్రబాబు అంటే బ్రాండ్… జగన్ అంటే జైలు అన్నారు నారా లోకేష్. పూతలపట్టు నియోజకవర్గం వజ్రాలపల్లి క్యాంప్ సైట్ లో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో భేటీ అయిన నారా లోకేష్…అనంతరం మీడియాతో మాట్లాడారు. బీసీలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది టిడిపి పాలనలోనేనని..అబద్దం తియ్యగా ఉంటుంది. నిజం చేదుగా ఉంటుందన్నారు.

నేను జగన్ లా మోసపు హామీలు ఇవ్వనని..టిడిపి పాలనలో బిసిలకు ఇచ్చినన్న నిధులు ఎవ్వరూ ఇవ్వలేదని వెల్లడించారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్ రెడ్డి ఒక్క బీసీ కి ఒక్క లోన్ అయినా ఇచ్చారా? 45 ఏళ్లకే బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తా అని మోసం చేశారని గుర్తు చేశారు.

రిజర్వేషన్లు 10 శాతం తగ్గించి 16,500 మందిని జగన్ పదవులకి బీసీలను దూరం చేసాడని..విదేశీ విద్య పథకం రద్దు చేసి బీసీలను మోసం చేశారని ఫైర్‌ అయ్యారు. 26 మంది బీసీలను దారుణంగా చంపేశారని.. సలహాదారులుగా ఉండటానికి బీసీలు సరిపోరా అని ప్రశ్నించారు. 1000 ముఖ్య పదవులు జగన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు.బీసీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని లోన్స్ ఇచ్చారో జగన్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చెయ్యాలని డిమాండ్‌ చేశారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news