టీడీపీ అన్ స్టాపబుల్…బాలయ్య డైలాగులతో రెచ్చి పోయిన లోకేష్

-

టీడీపీ ఆవిర్భావ సభలో సంచలన కామెంట్లు చేసిన లోకేష్… తాను చంద్రబాబు తరహా కాదని.. మూర్ఖుడనంటూ వ్యాఖ్యలు చేశారు. బాలయ్య డైలాగులతో ఆవిర్భావ సభలో ప్రసంగించిన లోకేష్…. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి మీద రూ. 2 లక్షల అప్పు ఉండబోతోందని ఫైర్‌ అయ్యారు. సమయం లేదు మిత్రమా..? ఇంకా రెండేళ్లే సమయం ఉంది.. ప్రజల్లోకి వెళ్లాలని.. చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలను అధికారులను వదిలి పెట్టనని హెచ్చరించాడు.


అమెరికా కాదు.. ఐవరీ కోస్టుకు వెళ్లినా వదిలి పెట్టనని.. తల్లి బాధేంటో నాకు తెలుసు.. రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు పనులు చేసిన అధికారులను వదిలి పెట్టను.. నేను అన్నీ గుర్తు పెట్టుకుంటానని వార్నింగ్‌ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక నాతో మాట్లాడాలంటే 12 కేసులుండాల్సిందేనని.. 12 కేసులకంటే తక్కువగా ఉన్నాయంటే వైసీపీపై పోరాడ లేదని అర్ధమన్నారు. రికార్డులు సృష్టించాలన్నా.. తిరగ రాయాలన్నా టీడీపీకే సాధ్యమని.. టీడీపీ అన్ స్టాపబుల్‌ అంటూ డైలాగ్‌ విసిరారు.

టీడీపీ ప్రజల పార్టీ.. జగనుది గాలి పార్టీ అని.. మహిళలకు ఆస్తిలో టీడీపీ సమాన హక్కు కల్పిస్తే.. ఆ హక్కు లేదంటూ తల్లిని-చెల్లిని జగన్ పక్క రాష్ట్రానికి తరిమేశారన్నారు. టీడీపీది బ్రాండ్ కియా అయితే.. వైసీపీది కోడి కత్తి బ్రాండ్ అంటూ ఓ రేంజ్‌ ఫైర్‌ అయ్యారు. టీడీపీ పసుపు కుంకమ ఇస్తే.. వైసీపీ పసుపు కుంకమలు చెరిపేస్తోందని వ్యాఖ్యనించారు. చంద్రబాబు లాంటి విజనరీ కావాలా..? జగన్ లాంటి ప్రిజనరీ కావాలా..? నిర్ణయించుకోవాలని ఏపీ ప్రజలను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news