ఏపీలో కొత్త వేరియంట్‌ కేసులు నమోదు కాలేదు – ఏపీ వైద్యారోగ్య శాఖ

-

ఏపీలో కొత్త వేరియంట్‌ కేసులు నమోదు కాలేదని ఏపీ వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. కొవిడ్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వుందని… ఏపీలోని కోవిడ్ విషయంలో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించింది. నవంబర్ నెల నుంచి దాదాపు 30 వేల శ్యాంపిళ్లు టెస్ట్ చేయగా 130 పాజిటివ్ కేసులొచ్చాయని తెలిపింది.

ap carona
ap carona

అన్నీ ఒమిక్రాన్ తప్ప కొత్త వేరియంట్లేవీ నమోదు కాలేదని.. జినోమ్ సీక్వెన్సింగ్ టెస్టుకు ఏర్పాట్లు చేశామని స్పష్టం చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబులు అందుబాటులో వున్నాయని వివరించింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసియు బెడ్లు సిద్ధంగా వుంచామని… ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు , మందులు కూడా అందుబాటులో వున్నాయని తెలిపింది. వైఎస్సార్ హెల్త్ క్లినిక్లల్లో నిరంతర పర్యవేక్షణ వుంటుందని పేర్కొంది ఏపీ వైద్యారోగ్య శాఖ.

 

Read more RELATED
Recommended to you

Latest news