నేడు మహానాడులో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు..ఏకంగా 15 లక్షల మందితో

-

 

నేడు రాజమండ్రిలో టిడిపి మహానాడులో భాగంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 8 గంటలకు వేమగిరి మహానాడు ప్రాంగణం నుండి టిడిపి అధినేత చంద్రబాబు ర్యాలీ నిర్వహించనున్నారు. వేమగిరి నుండి బొమ్మూరు, మోరంపూడి , ఆర్టీసి బస్టాండ్ , స్టేడియం రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు చంద్రబాబు ర్యాలీ ఉండనుంది.

అనంతరం కోటిపల్లిబస్టాండ్ వద్ద ఉన్న ఏన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్న చంద్రబాబు… తిరిగి వేమగిరి మహానాడు ప్రాంగణానికి చేరుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో విశ్రాంతి తీసుకోనున్నారు. సాయంత్రం 3 గంటలకు వేమగిరి జంక్షన్ సమీపంలో వంద ఏకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహానాడు భారీ బహిరంగ సభలో ముఖ్యఅతిధిగా ప్రసంగించనున్న
చంద్రబాబు.. ఎన్నికలు జరుగునున్న నేపధ్యంలో ఈ మహానాడు సభలో ముందస్తు టిడిపి మ్యేనిపేస్టో ప్రకటించనున్నారు. మహానాడు భారీ బహిరంగ సభ కోసం జనసమీకరణ చేస్తున్నాయి టిడిపి శ్రేణులు. సుమారు 15 లక్షల మందితో బహిరంగ సభ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version