అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రల మీద మరో కేస్ ?

ఏపీ సర్కార్ ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ టీడీపీ మంత్రుల మీద మరో కేస్ రెడీ చేసినట్టు చెబుతున్నారు. ఆప్కో ఆప్కో మాజీ చైర్మెన్ గుజ్జల శ్రీనివాసులు మీద సిఐడీ రైడ్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు సంబందించిన గోడౌన్ లు ఇతర సొసైటీలలో సీబి సిఐడి బృందం సోదాలు చేసింది. గతంలో జరిగిన అవినీతి అక్రమాల మీద విచారణ సాగుతోంది.

ఆయన ఇంట్లో ఇప్పటికే కోటి రూపాయలు నగదు, మూడు కేజీల బంగారం , రెండు కేజీల వెండి , కీలక ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఆప్కో స్కాంపై గత ప్రభుత్వ పెద్దల పాత్రపై ప్రభుత్వం ఆరా తీస్తోన్నట్టు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో చేనేత, జౌళి శాఖ మంత్రులుగా పని చేసిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర పాత్రపై వివరాల సేకరిస్తున్నట్టు చెబుతున్నారు. ఇంకొందరి ఉన్నతాధికారుల ప్రమేయం పైనా ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఈ స్కామ్ లో భాగస్వాములైన అప్కోలో విధులు నిర్వహించే పలువురు ఉద్యోగులపై చర్యలకు కూడా ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.