జనసేనకు “ఆరెంజ్” చిత్ర బృందం ఆర్థిక సాయం

-

జనసేన పార్టీకి “ఆరెంజ్” చిత్ర బృందం ఆర్థిక సాయం చేసింది. “అంజనా ప్రొడక్షన్స్” పతాకంపై జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు నిర్మించిన “ఆరెంజ్” చలన చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించటం ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1.05 కోట్లు జనసేన పార్టీకి మద్దతుగా అందజేశారు.

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీ నాగబాబు గారు చెక్కు రూపంలో ఈ మొత్తం అందజేశారు. “ఆరెంజ్” చలన చిత్రం రెండవ సారి విడుదల చేసి ప్రదర్శించేందుకు కీలక భూమిక పోషించిన సాయి రాజేష్, ధర్మేంద్ర, ఎస్.కే.ఎన్., శివచెర్రీ, శ్రీనాథ్, ఉమా నాగేంద్ర, శ్రీధర్ తదితరులను శ్రీ నాగబాబు గారు ప్రత్యేకంగా అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news