డైటింగ్‌లో ఉన్నారని డైట్‌ కోక్‌ వాడుతున్నారా..? ‘గుండె’ పగిలేపోయే వార్త మీకోసమే..!

-

డైట్‌ కోక్‌: బరువు తగ్గాలనుకునే వారు.. వాళ్లకు ఇష్టమైన వాటిని మానేయరు.. ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటారు..ఇప్పుడు కూల్‌ డ్రింక్స్‌ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు.. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా..! మళ్లీ బరువు తగ్గాలి అనుకున్నప్పుడు పూర్తిగా కూల్‌డ్రింక్స్‌ మానేయాలి కానీ.. డైట్‌ కోక్‌లు ఎందుకు తాగడం.. అసలు చాలా మంది ఫ్యాషన్‌గా చెప్తారు.. అరే డైట్‌లో ఉన్నారా.. డైట్‌ కోక్‌ మాత్రమే తాగుతా అని. పాపం వాళ్లు అనుకుంటారు.. డైట్‌ కోక్‌ వల్ల ఏం కాదు అని.. మామూలు కోక్‌కు డైట్ కోక్‌కు పెద్దగా తేడా ఏమీ లేదు, దానితో ఎలాంటి ప్రయోజనమూ లేదు అని నిపుణులు అంటున్నారు..

 

బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా చక్కెరకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా అత్యధిక ఆర్టిఫిషియల్ చక్కెరలు ఉండే సాఫ్ట్ డ్రింక్స్ అసలు వాడకూడదు. కానీ ఈ మధ్య డైట్ కోక్ వంటిలో క్యాలరీడ్ డ్రింక్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చక్కెరలు తక్కువగా ఉంటాయని నమ్మి చాలా మంది తాగేస్తున్నారు. ఇవి ఉపయోగకరం కాదని WHO హెచ్చరిస్తోంది. వీటిలో ఉండే రసాయనాలు గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయట.

నాన్ షుగర్ స్వీట్నర్ల వల్ల బరువు తగ్గతారనుకోవడం పూర్తిగా మీ అపోహ మాత్రమే. వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని డబ్ల్యూహెచ్ ఓ కు చెందిన ప్రాన్సిస్కో బ్రాంకా అంటున్నారు. ఫ్రీ షుగర్ ఇన్ టేక్ తగ్గించేందుకు పండ్లు, పండ్ల రసాల వంటి సహజమైన ఇతర తియ్యని పదార్థాలను ఉపయోగించడం మంచిది. ఆర్టిఫిషియల్ షుగర్స్‌లో ఎలాంటి పోషకాలు ఉండవు.

ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు వీలైనంత త్వరగా ఫ్రీ షుగర్స్ వినియోగాన్ని తగ్గించాలి. ఇది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాలా అవసరం. దాదాపుగా 283 అధ్యయనాల అనంతరం ఈ నివేదికను విడుదల చేశారు. ఆ అధ్యయనాలలో పెద్దలు, పిల్లలు, గర్భిణుల వంటి అన్ని రకాల జనాభాను పరీక్షించారు.

అస్పర్టమే, స్టివియా వంటి అర్టిఫిషియల్ స్వీట్నర్ల ద్వారా బరువులో పెద్ద మార్పేమీ ఉండదట. వీటిని దీర్ఘకాలం పాటు వినియోగించినపుడు మధుమేహం, ఇతర గుండె సంబంధ సమస్యలతో ప్రమాదకర పరిస్థితులు కూడా ఎదురుకావచ్చని హెచ్చరించింది. పూర్తి స్థాయిలో నిర్ధారించేందుకు మరింత పరిశోధన అవసరమని సైంటిస్టులు అంటున్నారు.

డైట్ కోక్ తాగిన మొదటి పది నిమిషాల్లోనే అందులోని యాసిడ్ దంతాల మీద ప్రభావం చూపుతుంది. ఒక గంట తర్వాత ఇంతకు ముందు కంటే ఎక్కువ దాహంగా అనిపిస్తుంది..

బరువు తగ్గాలని అనుకునే వారు సంప్రదాయ చక్కెరలు మాత్రమే కాదు.. ఆర్టిఫిషియల్ చక్కెరలను కూడా దూరంగా పెట్టాలి.

Read more RELATED
Recommended to you

Latest news